దూసుకుపోతున్న 'బీస్ట్' సాంగ్!

Admin 2022-02-15 01:44:49 entertainmen
విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ 'బీస్ట్' సినిమాను రూపొందించాడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయగా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది.

హీరో శివకార్తికేయన్ పాటలు రాస్తాడనే విషయం తెలిసిందే. ఆయన రాసిన పాటను ఖరీదైన సెట్లో చిత్రీకరించారు. అనిరుధ్ స్వరపరిచిన ఆ పాటను రీసెంట్ గా రిలీజ్ చేయగా 1 మిలియన్ కి పైగా వ్యూస్ ను రాబట్టింది. జొనిత గాంధీతో కలిసి అనిరుధ్ ఈ పాటను ఆలపించాడు. యూత్ కి కనెక్ట్ అయ్యే ఈ బీట్ కి జానీ మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు.