మెగాస్టార్ చిరంజీవి న్యూలుక్... సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Admin 2020-09-11 13:04:41 entertainmen
మెగాస్టార్ చిరంజీవి న్యూలుక్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇన్స్ట్రగ్రామ్ లో ఆయన షేర్ చేసిన ఫొటోను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. గుండుతో చిరు కనిపిస్తున్నారు. అయితే, చిరుగడ్డం, చిరుమీసంతో నల్ల కళ్లజోడు ధరించి చిరంజీవి డిఫరెంట్ లుక్ లో ఉన్నారు. 'నేను సన్యాసిలా ఆలోచించగలనా?' అనే క్యాప్షన్ ను కూడా చిరు ఇచ్చారు. ఇంతకు మించి ఫొటో గురించి ఆయన వివరాలను వెల్లడించలేదు. ఇది నిజమైన గుండేనా? లేక ఫ్యూచర్ ప్రాజెక్ట్ కోసం ఏదైనా ఫొటో షూట్ చేశారా? అనే విషయం తెలియాల్సి ఉంది.