గతంలో జరిగిన ఘటనను వెల్లడించిన సన్నిహితులు

Admin 2022-03-02 10:35:52 entertainmen
దీపికా పదుకొణే .. ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ ను వివాహం చేసుకుని జీవితాన్ని హాయిగా గడిపేస్తోంది. ఇటీవల ఓ యువ హీరోతో ‘గెహ్రాయియా’ సినిమా చేసి హిట్ అందుకుంది. అయితే, ఆ సినిమాలో బోల్డ్ సీన్లలో నటించి కొందరి నుంచి విమర్శలనూ ఆమె ఎదుర్కొంది. ఈ విషయాన్ని పక్కనపెడితే.. పెళ్లి కాకముందు ఆమె నిహార్ పాండ్యా, రణ్ బీర్ కపూర్ తో ప్రేమాయణం నడిపింది. అయితే, ఆ రిలేషన్లు ఎక్కువ కాలం నిలబడలేదు.

ఈ క్రమంలోనే ఆమె పాత రిలేషన్లకు సంబంధించి దీపిక సన్నిహితులు తాజాగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఓసారి దీపిక మాజీ ప్రియుడు నిహార్ పాండ్యాను రణ్ బీర్ కపూర్ నడిరోడ్డుపై కొట్టాడని చెప్పారు. రణ్ బీర్ కపూర్ తో డేటింగ్ చేసే సమయంలోనే.. ఆమె తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నిహార్ పాండ్యాతో చనువుగా ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఒకానొక సందర్భంలో సినిమా షూటింగ్ కోసం రణ్ బీర్ ఊటీకి వెళ్లినప్పుడు.. ఆమె నిహార్ తో లంచ్ కు వెళ్లిందని, దాదాపు రెండు గంటల పాటు వారి లంచ్ డేట్ జరిగిందని చెప్పారు.