- Home
- hollywood
క్యూట్ గా కనిపిస్తున్నారు జంట
ప్రియాంక చోప్రా తాజాగా భర్త నిక్ జోనస్ తో దిగిన కొన్ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆదివారం ఈ జంట తమ అమూల్యమైన గడప గడపటానికి బీచ్ కెళ్లారు. ఈ మేరకు భర్త తో బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ప్రియాంక సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ప్రియాంక అభిమానులు ఈ జంటను చూసి తెగ మురిసిపోతున్నారు.
ఈ ఫోటోలలో ఎంతో అన్యోన్యంగా, క్యూట్ గా కనిపిస్తున్నారు ఈ జంట. కలలు ఎలా తయారవుతాయో తెలుసా అంటూ కామెంట్ చేసి ప్రియాంక షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆదివారం ఈస్టర్ ను పురస్కరించుకుని తమ ఈస్టర్ పండగ ఎలా జరిగిందో తెలుపుతూ ఆ దృశ్యాన్ని కూడా ప్రియాంక సోషల్ మీడియాలో షేర్ చేసింది. మ్యాట్రిక్స్ రిసర్రక్షన్స్ అనే హాలీవుడ్ సినిమాలో ఇటీవలే కనిపించిన ప్రేక్షకులను అలరించిన ప్రియాంక ఫర్హాన్ అక్తర్ డైరెక్షన్‌లో జీ లే జరా అనే బాలీవుడ్ సినిమాలో నటించబోతుంది.