రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి ఈ రోజు ఏకంగా 30 కిలోమీటర్లు సైక్లింగ్

Admin 2020-08-19 22:43:41 entertainmen
రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి ఈ రోజు ఏకంగా 30 కిలోమీటర్లు సైక్లింగ్ చేశారు. హైదరాబాద్‌లోని సుచిత్ర ఎక్స్ రోడ్ నుంచి తూప్రాన్ రోడ్డు మీదుగా వాళ్లిద్దరూ సైకిల్ తొక్కారు. సైక్లిస్ట్ ఆదిత్యా మెహతా బృందంతో కలిసి వారు ఇందులో పాల్గొన్నారు ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆదిత్య మెహతాతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. 'థ్యాంక్యు.. చాలా ఇష్టపడి చేశాం. త్వరలో 100 కిలోమీటర్ల సైక్లింగ్‌ కూడా చేస్తాం' అంటూ రకుల్ ప్రీత్ ట్వీట్ చేస్తూ నవ్వుతూ ఉన్న ఎమోజీని పోస్ట్ చేసింది.