ఏప్రిల్ 23 నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ లో సమంత, విజయ్ దేవరకొండ

Admin 2022-04-19 03:23:39 ENT
సమంత, విజయ్ దేవరకొండ జంటగా ఒక సినిమా రూపొందుతుంది. పూర్తి స్థాయి లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సమంత కాశ్మీరీ యువతి గాను, విజయ్ కాశ్మీర్ లో పనిచేసే ఆర్మీ ఆఫీసర్ గాను నటిస్తున్నట్టు తెలుస్తుంది. కాశ్మీర్ వంటి మంచు ప్రదేశాలలో ఎక్కువ శాతం షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం ఏప్రిల్ 21న పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభం కానుందని టాక్. ఏప్రిల్ 23 నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వబోతుందట. ఈ మూవీ కి సమంత, విజయ్ లిద్దరూ నాలుగు నెలల సమయాన్ని కేటాయించారట.

ఎందుకంటే సమంత త్వరలోనే బాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ లో నటించటానికి విదేశాలకు వెళ్లనుంది. ఇక విజయ్ ఏమో పూరి డైరెక్షన్లో రూపొందనున్న JGM చిత్ర షూటింగులో పాల్గొనాల్సి ఉండటంతో నాలుగు నెలలలోనే ఈ మూవీ ని పూర్తి చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారట సామ్, విజయ్.