దానిమ్మ ఆరోగ్యానికి కాదు.. అందానికి కూడా..!

Admin 2022-04-21 12:21:25 ENT
- దానిమ్మలో కార్బోహైడ్రేట్లు, చక్కెర, ఫైబర్, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, సోడియం, జింక్, విటమిన్ సి, థియామిన్, రిబోప్లేవిన్, నియాసిన్, విటమిన్ బి6, ఫోలేట్, విటమిన్ ఇ, విటమిన్ కె వంటి పోషకాలు ఉంటాయి.

- దానిమ్మ గింజలు క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. క్యాన్సర్ కణాల విస్తరణను నిరోధించి, క్యాన్సర్ కణాల మరణాన్ని కూడా ప్రేరేపించే ప్యూనిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటాయి. దానిమ్మ రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.

- గుండె సంబంధిత వ్యాదులకి చెక్ పెట్టడంలో దానిమ్మ చాలా ఉపయోగపడుతుంది.

- రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది.

- ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలా మంచిది.

- దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్స్ , చర్మపు మంటలను, మొటిమల నుండి కాపాడి చర్మం సామర్థ్యాన్ని పెంచుతాయి.

- దానిమ్మ గింజలలో పుష్కలంగా లభించే పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తి మెరుగుపరుస్తుంది. అల్జీమర్స్ వ్యాధికి కారణమయ్యే మెదడు యొక్క నాడీ కణాల మధ్య పేరుకుపోయే అమిలోయిడ్ ఫలకం స్థాయిలను తగ్గిస్తుంది.