- Home
- tollywood
వాట్ టు డు... వాట్ నాట్ టు డు సితారకు బాగా తెలుసు - నమ్రత
సితార ఘట్టమనేని... తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ల గారాల పట్టి. యూట్యూబ్ ట్యుటోరియల్స్, ఇంస్టాగ్రామ్ వీడియోస్ తో సితార బాగా పాపులర్ అయ్యింది. ఈ మధ్యనే మహేష్ కొత్త సినిమా సర్కారువారిపాట లో పెన్నీ సాంగ్ తో టాలీవుడ్ కు అఫీషియల్ ఎంట్రీ ఇచ్చింది ఈ మల్టీ టాలెంటెడ్ కిడ్. మహేష్, నమ్రతలిద్దరూ తనకు నచ్చింది చేసేలా సితారకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ విషయమై నమ్రత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... సితార విషయంలో నాకూ, మహేష్ కు ఎలాంటి భయం లేదు. తనకి ఏది ఆనందాన్నిస్తుందో, తను ఏం చేయాలనుకుంటుందో అనేదానిపై సితారకే పూర్తి స్వేచ్ఛనిచ్చాము. అయితే ఆ స్వేచ్చకు కొన్ని హద్దులు కూడా ఉంటాయి. తనకింకా 9 ఏళ్ళే. ఈ వయసులో తనకు తల్లితండ్రుల పర్యవేక్షణ చాలా అవసరం. సరైన సమయంలో సరైన పనులు చేసేలా మేము తనని గైడ్ చేస్తున్నాము. తన లిమిట్స్ లో వాట్ టు డు... వాట్ నాట్ టు డు అన్నది సితారకు బాగా తెలుసు.... అంటూ చెప్పుకొచ్చింది.