- Home
- tollywood
బ్యాంకు స్కామ్ నేపథ్యంలో సాగే...సర్కారువారి పాట
సర్కారువారి పాట అధికారికంగా ప్రకటించింది. మైత్రీ మూవీ మేకర్స్ .. 14 రీల్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన రెండు పాటలకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. త్వరలో మరో సాంగ్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. బ్యాంకు స్కామ్ చుట్టూ తిరిగే కథ ఇది. భారీ యాక్షన్ కి కామెడీ టచ్ ఉన్న కథ ఇది. మహేశ్ బాబు .. వెన్నెల కిశోర్ కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ అంటున్నారు. సముద్రఖని కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, మే 12వ తేదీన విడుదల చేయనున్నారు. 'గీత గోవిందం' తరువాత పరశురామ్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.