అతన్ని ఔట్ చేయడమే నా లక్ష్యం : ఉమ్రాన్ మాలిక్

Admin 2022-04-23 01:05:51 ENT
ప్రస్తుతం భారత క్రికెట్ లో విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిన్నటి వరకు టీమిండియాలో 3 ఫార్మాట్లకు కెప్టెన్ కొనసాగిన విరాట్ కోహ్లీ ఇక టీమిండియాను ముందుకు నడిపించాడు.అయితే కేవలం టీమిండియా కెప్టెన్గా మాత్రమే కాకుండా ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా కూడా కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. ఇప్పటి వరకు ప్రపంచ క్రికెట్లో ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు అనే విషయం తెలిసిందే. ఇక విరాట్ కోహ్లీ అభిమానులు అందరూ కూడా రికార్డుల రారాజు అని అంటూ ఉంటారు. ఇలా ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ క్రికెటర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ వికెట్ ఒక్కసారి చూస్తే చాలు ఇక అంతకంటే ఇంకేం అవసరం లేదు అని ఎంతో మంది బౌలర్లు కూడా అనుకుంటూ ఉంటారు.

అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెడుతున్న యువ బౌలర్లు భారత క్రికెట్ లో దిగ్గజంగా కొనసాగుతున్న కోహ్లీ వికెట్ ఒకసారి తీస్తే ఇక అది తమ కెరియర్కి కీలక మలుపు అని అనుకుంటూ ఉంటారు. ఇక తనకు కూడా అలాంటి కోరిక ఉంది అంటే చెబుతున్నాడు సన్రైజర్స్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్. ప్రస్తుతం సన్రైజర్స్ లో కీలక బౌలర్ గా కొనసాగుతున్నాడు ఉమ్రాన్ మాలిక్. మెరుపులాంటి బంతులు విసిరుతు బ్యాట్స్మెన్లను బెంబేలెత్తిస్తున్నాడు. అద్భుతమైన టెక్నిక్ తో వికెట్లు కూడా తీయటం చూస్తూనే ఉన్నాం. ఇటీవలే ఆలోచన మనసులో మాట బయట పెట్టాడు ఉమ్రాన్ మాలిక్.