తొలి సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయినా.. నటిగా మాత్రం ఈ భామకు మంచి మార్కులు పడ్డాయి. అది అలా ఉంటే తాజాగా శివాత్మిక కొన్ని ఫోటోస్‌ను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా శివాత్మిక ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాయంటూ విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. శివాత్మిక ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న రంగ మార్తండలో నటిస్తున్నారు.