- Home
- bollywood
కంగన భద్రతకు నెలకు రూ. 10 లక్షలు.. : సుప్రీంకోర్టు న్యాయవాది
ఇటీవల వివాదాల్లోకి ఎక్కిన బాలీవుడ్ నటి కంగన రనౌత్‌కు కేంద్రం కల్పిస్తున్న ‘వై’ కేటగిరీ భద్రతపై సుప్రీంకోర్టు న్యాయవాది బ్రిజేష్ కలప్ప విమర్శలు కురిపించారు. ఒక మనిషికి నెల రోజులపాటు భద్రత కల్పించేందుకు కేంద్రానికి 10 లక్షల రూపాయలు అవుతుందని, ప్రజల నుంచి వసూలు చేసే పన్నులను ఇలాంటి వాటికి ఉపయోగించడం తగదని కలప్ప ట్వీట్ చేశారు. కంగన ఇప్పుడు హిమాచల్‌ప్రదేశ్‌లో సురక్షితంగా ఉన్నారు కాబట్టి సెక్యూరిటీని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా? అని ప్రశ్నించారు.