హిందీ భాష‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు : కిచ్చ సుదీప్

Admin 2022-04-25 12:56:23 ENT
తాజాగా ఆయ‌న ఓ స‌మావేశంలో మాట్లాడుతూ... కేజీఎఫ్‌ 2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ బాలీవుడ్ పై స్పందించాడు. హిందీ ఇక నుంచి ఏమాత్రం జాతీయ భాష కాదని, బాలీవుడ్‌ ఎన్నో పాన్‌ ఇండియా సినిమాలను నిర్మిస్తోందని చెప్పాడు. సినిమాల‌ను తెలుగు, తమిళంలో డబ్ చేసేందుకు బాలీవుడ్ ప్ర‌ముఖులు ఎంతో కష్టపడుతున్నారని అన్నాడు. అయితే, ఆ బాలీవుడ్ సినిమాలు అంతగా విజయం సాధించలేకపోతున్నాయని, మనం తీస్తున్న సినిమాలను మాత్రం ప్రపంచం మొత్తం చూస్తున్నార‌ని ఆయ‌న చెప్పాడు.