ప్రధానమైన పాత్రను పోషించిన అనశ్వర రాజన్

Admin 2024-01-31 12:46:35 entertainmen
మలయాళంలో ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగా వినిపిస్తున్న పేరు 'అనశ్వర రాజన్'. కేరళలోని 'కరివెల్లూర్'లో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ, టీనేజ్ లోనే మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. టీనేజ్ లవ్ స్టోరీస్ లో యూత్ నుంచి మంచి ఫాలోయింగ్ ను పెంచుకుంది. అక్కడి కుర్ర హీరోలకు ఫస్టు ఆప్షన్ గా ఆమె నిలిచింది. నటన పరంగా ఆమె గెలుచుకున్న బహుమతులు కూడా అనేకం. మలయాళంలో ఇటీవల వచ్చిన 'నెరు' సినిమా, ఆమె కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నటన పరంగా ఆమెపై ఎంతో మంది ప్రముఖులు ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఈ సినిమాలో ప్రధానమైన పాత్ర ఆమెదే. ఆమె పాత్ర చుట్టూనే కథ అంతా తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో ఆమె అంధురాలి పాత్రలో కనిపిస్తుంది. చూపులేని యువతినే ఆ పాత్రకి తీసుకున్నారేమో అనేంత సహజంగా ఆమె నటించింది.