చాలా కాలంగా కానరాని పుష్ప 2 మూవీ అప్‌డేట్స్

Admin 2024-01-31 13:12:09 entertainmen
బ్లాక్ బస్టర్‌ మూవీ ‘పుష్ప’తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దీంతో, ఆయన అభిమానుల ఆనందానికి అంతేలేకుండా పోయింది. పుష్ప-2పై కూడా అంచనాలు అదేస్థాయిలో పెరిగిపోయాయి. ఈ మూవీ కోసం ఫ్యాన్స్‌తో పాటూ సాధారణ ఆడియన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, పుష్ప-2కు సంబంధించి చిత్ర బృందం నుంచి కొత్తగా ఏ అప్‌డేట్ రాలేదు. ఫలితంగా తొలుత అనుకున్న రిలీజ్ డేట్‌పై కూడా సందేహాలు మొదలయ్యాయి.

ఇలా స్పెక్యులేషన్ ఎక్కువైపోతుండటంతో మూవీ మేకర్స్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. రిలీజ్ డేట్‌పై పూర్తి స్పష్టత ఇచ్చేలా కొత్త పోస్టర్‌ను షేర్ చేశారు. పుష్ప 2 విడుదలకు సరిగ్గా 200 వందల రోజులే మిగిలుందని చెప్పారు. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా మూవీ రిలీజ్ అవుతుందని స్పష్టం చేశారు.