టాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టిన ఊర్వశి రౌతేలా

Admin 2024-02-01 11:19:08 entertainmen
బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా ఊర్వశి రౌతేలాకి మంచి క్రేజ్ ఉంది. హీరోయిన్ గా చేసినప్పటికీ, స్పెషల్ సాంగ్స్ ఆమెకి ఎక్కువగా గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఒక సినిమాలో హీరోయిన్ ప్లేస్ లో కనిపిస్తే ఎంత పారితోషికం అందుకుంటుందో .. స్పెషల్ సాంగ్ లో సందడి చేయడానికి కూడా ఆమె అంతే పారితోషికాన్ని పుచ్చుకుంటుంది.

అందువల్లనే ఊర్వశి స్పెషల్ సాంగ్స్ కి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ వెళుతోంది. ఊర్వశి మంచి డాన్సర్ .. ఫిట్ నెస్ ఆమె సొంతం. హాట్ .. హాట్ గా అందాలను ఆరబోయడంలో ఎంతమాత్రం మొహమాటం లేకపోవడం ఆమె ప్రత్యేకత. తెలుగులో వాల్తేర్ వీరయ్య .. ఏజెంట్ ... బ్రో ... స్కంద సినిమాల్లోని స్పెషల్ సాంగ్స్ లో ఆమె యూత్ ను .. మాస్ ను ఊపేసింది.