సంజయ్ లీలా భన్సాలీ నుంచి వెబ్ సిరీస్

Admin 2024-02-01 18:37:54 ENT
బాలీవుడ్ దర్శకులలో సంజయ్ లీలా భన్సాలీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గతంలో ఆయన తెరకెక్కించిన దేవదాస్ .. గంగూబాయి కథియావాడి .. బాజీరావ్ మస్తానీ .. రామ్ లీల వంటి సినిమాలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి. అలాంటి భన్సాలీ ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై కూడా తన జోరు చూపించడానికి సిద్ధమవుతున్నాడు.

ఆయన దర్శక నిర్మాణంలో ఒక వెబ్ సిరీస్ నిర్మితమైంది .. ఆ వెబ్ సిరీస్ పేరే 'హీరామండి ది డైమండ్ బజార్'. పాకిస్థాన్ - లాహోర్ ప్రాంతంలో ఒకప్పటి వేశ్యల జీవితాలు ఎలా ఉండేవి? అనే నేపథ్యంలో ఈ సిరీస్ ను రూపొందించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథ ఇది. త్వరలోనే ఇది 'నెట్ ఫ్లిక్స్' ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది.