కన్నడలో హిట్ కొట్టిన 'కాటేరా' - 200 కోట్లకి పైగా రాబట్టిన వసూళ్లు !

Admin 2024-02-06 19:38:58 ENT
కన్నడలో దర్శన్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన హీరోగా రూపొందిన 'కాటేరా' డిసెంబర్ 29వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఏడాది చివర్లో వచ్చినప్పటికీ, క్రితం ఏడాదిలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. 200 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. 'సలార్' బరిలో ఉండగా ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను సాధించడం విశేషం.

అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను జీ 5వారు సొంతం చేసుకున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. కన్నడతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా జగపతిబాబు నటించడం విశేషం.