- Home
- tollywood
కథ నచ్చితేనే కరుణించే సాయిపల్లవి .. మూడు భాషల్లో సాయిపల్లవికి క్రేజ్
సాయిపల్లవి .. తెలుగు ఆడియన్స్ లో ఈ పేరు పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందుకు కారణం మొదటి నుంచి ఆమె ఎంచుకుంటూ వచ్చిన కథలు .. పాత్రలు అనే చెప్పుకోవాలి. సాయిపల్లవి రాకముందు ఆడియన్స్ కేవలం హీరోల డాన్సులను గురించే మాట్లాడుకునేవారు. కానీ ఆమె వచ్చిన తరువాత ఆమె డాన్స్ ఆ సినిమాలకు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవడం మొదలైంది.
సాయిపల్లవికి తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ మూడు భాషల్లోను ఆమెకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అదే సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి అదే స్థాయిలో మద్దతు ఉంది. నెక్స్ట్ ఏ సీన్ తెరపై ఊడిపడుతుందో అనే డౌట్ లేకుండా సాయిపల్లవి సినిమాను హాయిగా .. తాపీగా చూడొచ్చనే ఒక నమ్మకం వాళ్లలో ఉంది. అలాంటి ఒక నమ్మకాన్ని ఆమె సంపాదించుకుంది.