రేపు రిలీజ్ కానున్న'ఊరుపేరు భైరవకోన'

Admin 2024-02-08 11:28:12 ENT
వర్ష బొల్లమ్మ ఒక వైపున ముఖ్యమైన పాత్రలను చేస్తూనే, మరో వైపున హీరోయిన్ గాను చేస్తూ వెళుతోంది. 'మిడిల్ క్లాస్ మెలోడీస్' .. ' స్టాండ్ అప్ రాహుల్' .. ' స్వాతి ముత్యం' సినిమాలు గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'ఊరు పేరు భైరవకోన' రెడీ అవుతోంది. రేపు ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో వర్ష బొల్లమ్మ బిజీగా ఉంది. 'స్వాతిముత్యం' సినిమా తరువాత బెల్లంకొండ గణేశ్ తో ఆమె ప్రేమలో పడినట్టుగా .. పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ విషయం ప్రస్తావనకు రావడంతో ఆమె స్పందించింది.