సౌత్‌లో ఓ వెలుగు వెలిగిన చందమామ కాజల్ అగర్వాల్ తాజాగా బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలో నటించింది. త్వరలో మరో సినిమాలో బాలయ్య సరసన నటించబోతోందనే టాక్ వినిపిస్తోంది.
పెళ్లి చేసుకున్న కాజల్ ఆ తర్వాత సినిమాలను తగ్గించుకుంది. సుదీర్ఘ విరామం ఇచ్చిన ఆమె బిడ్డకు కూడా జన్మనిచ్చింది. రీసెంట్ గా బాలయ్య సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన కాజల్ ప్రస్తుతం సత్యభామ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. కాజల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతుంది. మరోవైపు, ఆమె అప్పుడప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. తాజాగా బ్లాక్ కాలర్ ఏ లైన్ షర్ట్ ప్యాంట్‌లో ట్రెండీ లుక్‌తో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె బ్లాక్ డ్రెస్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
కాజల్ ట్రెండీ లుక్‌తో అభిమానులను, అభిమానులను ఆకట్టుకుంటోంది. బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ అందం ఏమాత్రం తగ్గలేదని, ఇంకా యువ కథానాయికలతో పోటీ పడుతూనే ఉందంటూ ఆమె ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తున్నారు.