నటి జ్యోతి రాయ్ టీవీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. 'గుప్పెడంత మనసు' సీరియల్‌తో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. బుల్లితెర ప్రేక్షకుల్లో ఆమెకున్న క్రేజ్ మరో స్థాయిలో ఉందనే చెప్పాలి. తెరపై చాలా స్టైలిష్‌గా మెరిసిపోయిన ఆమె సోషల్ మీడియాలో మాత్రం తన లుక్స్‌తో ఆశ్చర్యపరిచింది. హాట్ హాట్ ఫోటోషూట్ లు చేస్తూ ఎంత రచ్చ చేస్తారో తెలిసిందే. దీంతో జగతి మేడం నెట్టింట ఫాలోయింగ్ బాగా పెరిగిపోతోంది.
జ్యోతి రాయ్ ఇంటర్నెట్‌లో తన అభిమానులకు కొంత సమయం కూడా ఇస్తోంది. ఆమె వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సినిమాలు మరియు వ్యక్తిగత విషయాలను పంచుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఆమెకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెల్లడించింది.
అభిమానులతో చాట్ సెషన్‌లో, ఒక అభిమాని మీకు ఇష్టమైన హీరో ఎవరు అని అడగగా, జగతి మేడమ్ భారతదేశంలో తన అభిమాన స్టార్ హీరో గురించి చెప్పారు. జ్యోతిరాయ్ అభిమాన హీరో మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని ఆమె అన్నారు.