'పుష్ప‌-2'లో ర‌ష్మిక లుక్ లీక్‌..

Admin 2024-03-20 15:51:22 ENT
దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప-2' షూటింగ్ ఫోటోలు బయటకు రావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ సెట్ లో ఉన్న హీరోయిన్ రష్మిక మందన లుక్ లీక్ అయింది. శ్రీవల్లి పాత్రలో నటిస్తోన్న నేషనల్ క్రష్ రష్మిక ఎరుపు రంగు చీరలో బంగారు ఆభరణాలతో చాలా అందంగా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోను అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఇదిలావుంటే.. తాజాగా యాగంటి ఆలయంలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ విశేషాలను రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అభిమానులతో పంచుకుంది. షూటింగ్ స్పాట్‌లో తీసిన ఫోటోను కూడా షేర్ చేసింది. "ఈరోజు ఈ ఆలయంలో సినిమా చిత్రీకరించబడింది. యాగంటి అంటే ఈ ఆలయ స్థల పురాణం నిజంగా అద్భుతమైనది. ఇక్కడి ప్రజలు, వారి ప్రేమ వర్ణించలేనిది. ఈ రోజు అద్భుతమైన రోజు" అని ఆమె చెప్పింది.

ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితం 'పింక్‌విల్లా'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 'పుష్ప-2'లో తన పాత్ర గురించి కొన్ని విషయాలు వెల్లడించింది. ‘‘సినిమాలో పుష్ప భార్యగా నా పాత్ర చాలా బాధ్యతాయుతంగా ఉంటుంది. రెండో భాగంలో మొదటి భాగం కంటే ఎక్కువ డ్రామా ఉంటుంది మరియు పాత్రల మధ్య ఇంటెన్సిటీ కూడా అదే స్థాయిలో ఉంటుంది. అలాగే పార్ట్-2లో చాలా మసాలా ఉంటుంది. అభిమానులు కోరుకుంటున్నారు" అని ఆమె అన్నారు.