ఇక ప్రచారానికి సిద్ధం! Kalki 2898 AD

Admin 2024-05-14 12:30:27 ENT
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 AD' నిర్మాణ దశ నుండి
పాన్-ఇండియా ఆసక్తిని ఆకర్షిస్తోంది.

భారతీయ పౌరాణిక ఇతిహాసాల స్ఫూర్తితో భవిష్యత్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె లాంటి టాప్ స్టార్స్ నటించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. ఈ చిత్రం జూన్ 27న విడుదల కానున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించింది.

ఈ కథ మహాభారత కాలంలో మొదలై దాదాపు ఆరు వేల సంవత్సరాల పాటు నడుస్తుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ ని వినూత్నంగా నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్‌వరల్డ్‌ కథ పౌరాణిక, సైన్స్‌ మేళవింపుగా ఉండడంతో ప్రేక్షకులందరికీ చేరువయ్యేలా భారీ స్థాయిలో ప్రమోట్‌ చేయబోతున్నట్లు సమాచారం. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనిదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.