మహేష్ బాబు లేటెస్ట్ న్యూ లుక్ అభిమానుల్లో ఉత్కంఠ!

Admin 2024-09-23 15:23:22 ENT
తమ అభిమాన హీరోలను చూస్తే అభిమానులకు కలిగే ఆనందమే వేరు. ఇక హీరో కొత్త లుక్‌లో కనిపిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. ఇప్పుడు మహేష్ కొత్త లుక్ చూసి ఆయన ఫ్యాన్స్ కూడా అదే ఫీలింగ్ ని అనుభవిస్తున్నారు. మహేష్, రాజమౌళి కలయికలో రానున్న సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో మహేష్ ఎలా కనిపించబోతున్నాడో అని అభిమానుల్లో ఒకింత ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ఘట్టమనేని హీరో కూడా ప్రస్తుతం అదే మేకోవర్‌లో ఉన్నాడు.

అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియానా జోన్స్ నేపథ్యంలో సాగుతుందని ఇటీవల రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మహేష్ లుక్ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మహేష్ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రూ. 50 లక్షలు, మరో రూ. 10 లక్షలు విరాళంగా అందజేశారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసంలో ఆయనను కలుసుకుని చెక్కును అందజేశారు.