- Home
- tollywood
ఆస్పత్రిలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేరిక..ఆందోళనలో అభిమానులు!
సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. తీవ్ర ఛాతి నొప్పి రావడంతో అర్థరాత్రి ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. గుండె సంబంధిత పరీక్షల కోసం రజనీకాంత్‌ని అడ్మిట్ చేశామని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రజనీకాంత్ సన్నిహితులు వెల్లడించారు. అయితే దీనిపై కుటుంబ సభ్యులు స్పందించలేదు. ప్రస్తుతం రజనీకాంత్ వెట్టయన్, కూలీ సినిమాలతో బిజీగా ఉన్నారు. దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానున్న వేట్టయన్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.