- Home
- tollywood
పవన్ కళ్యాణ్ చేసిన పని చాలా బాధ కలిగించింది... వైరల్ అయిన పవర్ స్టార్ తల్లి వ్యాఖ్యలు..!
పవన్ కళ్యాణ్... ఈ పేరు గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీస్ రికార్డుల నుంచి రాజకీయాల్లో చరిత్ర సృష్టించే వరకు పవన్ కళ్యాణ్ పెద్ద తుపాను.. ఈ మాట నేను చెప్పడం లేదు. మన దేశ ప్రధాని మోదీ అన్నారు. అసలు ఏపీ రాజకీయాల్లో కొత్త చరిత్ర లిఖించాడు. అంటే గత 50, 60 ఏళ్లలో ఎన్నడూ చూడని రాజకీయం చేసి చూపించారు. అసలు రాజకీయాలపై ఆసక్తి లేని వారు కూడా ఈసారి ఏపీ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు.. పవన్ ఏ రేంజ్ లో ప్రభావం చూపించాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
కానీ.. ఈ స్థాయికి చేరుకోవడానికి పవన్ పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. రాజకీయాల్లో జీరో నుంచి హీరోగా వచ్చిన సంచలన ప్రయాణం స్ఫూర్తిదాయకం. అయితే పవన్ గురించి... తన విజయాలు, కష్టాల గురించి పవన్ కళ్యాణ్ తల్లి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.. పూర్తి ఇంటర్వ్యూ త్వరలో విడుదల కానుందని జనసేన పార్టీ అధికారిక ఖాతా నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది.