వెండితెరపై తన అందచందాలతో హవా నడిపిన ఓ స్టార్ హీరోయిన్.. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. తన క్లోజ్ ఫ్రెండ్ మాజీ భర్తను పెళ్లి చేసుకుని ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
సినిమాల్లోకి రాకముందే బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. బాలీవుడ్‌లో అడుగుపెట్టినా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మారి పాపులర్ అయ్యింది. ఆమె ఎవరో మీకు గుర్తుందా? మేము హన్సిక మోత్వాని గురించి మాట్లాడుతున్నాము.
అనతికాలంలోనే తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యి టాలీవుడ్‌ని షేక్ చేసింది హన్సిక. అల్లు అర్జున్ దేశముదురు సినిమాలో యాపిల్ గాళ్ గా తన అందచందాలతో యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది.
15 ఏళ్ల వయసులో పూరీ జగన్నాథ్, అల్లు అర్జున్ ల ‘దేశముదురు’ సినిమాతో హీరోయిన్ ఆఫర్ అందుకుంది. ఆమె అందచందాలకు టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ రాణించిన ఈ క్యూటీ ఎన్నో హిట్ సినిమాల్లో భాగమైంది.
గత ఏడాది డిసెంబర్ 4న రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ముండోటా ఫోర్ట్ ప్యాలెస్‌లో హన్సిక తన సన్నిహితురాలు రింకీ మాజీ భర్త సోహైల్ ఖతురియాను వివాహం చేసుకుంది. సంప్రదాయబద్ధమైన వివాహ వేడుకలో ఈ జంట వివాహంలో ఒక్కటయ్యారు. ప్రస్తుతం అతనితో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.