- Home
- tollywood
నాగ చైతన్య సమంతల విడాకుల విషయం ఇప్పుడు పొలిటికల్ హీట్ గా మారింది
నాగ చైతన్య సమంతల విడాకుల విషయం ఇప్పుడు పొలిటికల్ హీట్ గా మారింది. నాగ చైతన్య సమంతల విడాకులకు కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. హీరో, హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేసింది కేటీఆర్ అని అన్నారు. అందరినీ డ్రగ్స్‌కు అలవాటు చేసే వాడు అతడేనని చెప్పారు.తమ జీవితాలతో ఆడుకుంటూ బ్లాక్ మెయిల్ చేసింది కేటీఆర్ కాదా అని ఆమె ప్రశ్నించారు.కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. నిన్న మొన్నటి వరకు వీరి విడాకుల విషయం సినీ ఇండస్ట్రీలో మాత్రమే చర్చనీయాంశమైంది.
ఇప్పుడు రాజకీయ రంగు పులుముకోవడం మరింత ఆసక్తికరంగా మారింది. మూడేళ్లుగా సాగుతున్న సామ్ చైతూ విడాకుల వార్త ఎవరినీ వదలడం లేదు.దీనికి తోడు నాగ చైతన్య రెండో పెళ్లికి సిద్ధమవడం.. అది కూడా మరో టాలీవుడ్ హీరోయిన్ శోభితా ధూళిపాళను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడడం.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.