- Home
- tollywood
యాక్షన్, డ్రామా, ఎమోషన్‌తో కూడిన జిగ్రా
అలియా భట్, వేదాంగ్ రైనా జంటగా నటించిన 'జిగ్రా' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. రానా 'జిగ్రా' చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా తెలుగులో విడుదల చేస్తున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ఎస్ రావు జమౌలి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేసిన జిగ్రా తెలుగు ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, రానా దగ్గుబాటి, సమంత హాజరయ్యారు. అనంతరం ఈ కార్యక్రమంలో అలియా భట్ మాట్లాడుతూ.. ‘‘ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత ‘జిగ్రా’ సినిమాతో వస్తున్నా.. యాక్షన్, డ్రామా, ఎమోషన్‌తో కూడిన ఇంటెన్స్ మూవీ ఇది. కార్యక్రమంలో వేదంగ్ రైనా, వాసన్ బాల పాల్గొన్నారు.