సౌత్ లో ఇప్పటికీ సమంత నెంబర్ వన్ హీరోయిన్. ఆమె వెండితెరపై కనిపించి ఏడాదికి పైగా అయ్యింది. అయినా సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సమంత మళ్లీ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. సమంత ప్రస్తుతం సిటాడెల్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైంది.
ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్ రూపొందినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. వరుణ్ ధావన్‌తో పాటు సమంత కూడా ఓ యాక్షన్ సీక్వెన్స్ చేసిందని స్పష్టమవుతోంది. అదే విధంగా ఈ వెబ్ సిరీస్ లో సమంత బోల్డ్ గా కనిపించిందని టాక్ వినిపిస్తోంది. టీజర్‌లో లిప్‌లాక్ సన్నివేశాలను చూపించారు. అంటే వెబ్ సిరీస్‌లో రొమాంటిక్ సన్నివేశాలకు కొదవలేదు. ఇందులో వరుణ్ ధావన్, సమంతల మధ్య బోల్డ్ సన్నివేశాలున్నాయని తెలుస్తోంది. ఆ సన్నివేశాల్లో వీరిద్దరూ రెచ్చిపోయి నటించారని బాలీవుడ్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ ట్రైలర్ తో సమంత సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.