నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు..'Baahubali 3'

Admin 2024-10-17 11:15:16 ENT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన 'Baahubali 1, & Baahubali 2' సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించాయి. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. 1000 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా Baahubali 2 నిలిచింది. ఈ క్రమంలోనే 'Baahubali 3' ఉంటుందని చాలా వార్తలు వచ్చాయి.

'Baahubali 3' తాజా అప్‌డేట్. అయితే ఆ మూవీ మేకర్స్ నుంచి కాదు.. 'కంగువ' నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారం క్రితమే ‘బాహుబలి’ మేకర్స్‌ని కలిశాను.. వాళ్ల లైనప్‌లో ‘బాహుబలి 3’ ఉంది’’ అని జ్ఞానవేల్ అన్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.