ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన హీరో అల్లు అర్జున్..

Admin 2024-10-22 12:21:20 ENT
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన అల్లు అర్జున్. అల్లు అర్జున్‌ శిల్పారవి ఇంటికి వచ్చింది వ్యక్తిగతమైనా.. భారీగా ఫ్యాన్స్‌ వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా.. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా జనసమీకరణ చేపట్టారంటూ నంద్యాల పోలీసులు బన్నీతోపాటు శిల్పా రవిపై కేసు నమోదు చేశారు. సెక్షన్‌ 188 కింద కేసు బుక్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో బన్నీ క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.