టీవీ షోలో యాంకర్‌ అనసూయ భావోద్వేగభరిత వ్యాఖ్యలు

Admin 2020-08-23 15:39:41 entertainmen
జీవితంలో తమ కుటుంబం పడిన కష్టాలను గురించి తెలుపుతూ యాంకర్ అనసూయ భావోద్వేగానికి గురైంది. బుల్లితెరలో యాంకరింగ్‌తో పాటు వెండితెరపై కూడా అలరిస్తోన్న ఈ ముద్దుగుమ్మ తన చిన్నతనంలోని తమ కుటుంబ పరిస్థితుల గురించి గుర్తు చేసుకుంది.

ఓ టీవీ ప్రోగ్రాంలో పాల్గొన్న ఆమె ఈ విషయాలను గురించి వివరించింది. తనను, తన చెల్లెళ్లను చదవించడానికి తన తల్లి ఎంతో కష్టపడిందని తెలిపింది. తన తల్లి చీరలకు ఫాల్స్ కుట్టి తమను చదివించాల్సి వచ్చిందని చెప్పింది. తన చిన్నప్పుడు అద్దె ఇంట్లో ఉండే వారిమని, ఒక్కోసారి అద్దె కట్టడం భారమై తక్కువ అద్దెకు దొరికే ఇంట్లోకి మారేవారిమని తెలిపింది. డబ్బు ఆదా చేయడానికి తాను రెండు బస్టాప్‌లు నడిచి బస్సు ఎక్కేదాన్నని చెప్పింది.