- Home
- tollywood
వెకేషన్‌లో పుష్ప-2 విజయాన్ని ఆస్వాదిస్తున్న బన్నీ
గతేడాది డిసెంబర్‌లో విడుదలైన పుష్ప2 బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రం బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టి రూ. 2000 కోట్లు. సినిమా ఇంత పెద్ద హిట్ అయినప్పటికీ బన్నీ సక్సెస్‌ని సరిగా ఎంజాయ్ చేయలేకపోయాడు.
పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో జరిగిన ప్రమాదం కారణంగా పుష్ప 2 విజయాన్ని బన్నీ సరిగ్గా ఆస్వాదించలేకపోయాడు. దేశం మొత్తం పుష్ప 2 విజయాన్ని జరుపుకుంటుంటే, బన్నీ ఏమీ చేయకుండా తన తోటలో కూర్చునేవాడని అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవిందే ఒకసారి ప్రెస్ మీట్ లో చెప్పిన విషయం తెలిసిందే.
రేవతి మరణం, శ్రీతేజ్ ఆసుపత్రిలో చేరడం, బన్నీ అరెస్ట్, బెయిల్‌పై విడుదల కావడం, బెయిల్ వచ్చినా వారానికోసారి పోలీస్ స్టేషన్‌కి వెళ్లడం.. ఇలా ఎన్నో అంశాలు బన్నీ మనశ్శాంతిని దూరం చేశాయి. ఇప్పుడు ఎట్టకేలకు బన్నీ మళ్లీ మామూలు స్థితికి వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే, ఆ కష్టాల నుండి బయటపడిన బన్నీ ఇప్పుడు పుష్ప 2 విజయాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాడు. అందులో భాగంగా అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి, పుష్ప 2 విడుదలైన వెంటనే బన్నీ సెలవులకు వెళ్లాలని అనుకున్నాడు, కానీ జరిగిన సంఘటనల కారణంగా, బన్నీ వాటన్నింటినీ రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
#Latest News #News #Movies