మీ కంఫర్ట్ జోన్ నుండి బయటకు రండి: రకుల్

Admin 2025-02-15 14:34:47 ENT
ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. కానీ గత కొంత కాలంగా రకుల్ కి ఆశించిన స్థాయిలో సినిమాలు రావడం లేదు. అమ్మడు చివరకు ఇండియన్ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమాలో తెలియని పాత్ర పోషించిన రకుల్ ఇప్పుడు తన భర్త నిర్మించిన బాలీవుడ్ సినిమాలో చేస్తోంది.

ప్రస్తుతం రకుల్ తన దృష్టి అంతా బాలీవుడ్ పైనే కేంద్రీకరించింది. అమ్మడు ప్రస్తుతం అజయ్ దేవగన్, మాధవన్ లతో కలిసి 'దే దే ప్రీ దే 2' చిత్రంలో నటిస్తోంది. దీనితో పాటు, ఆమె కమల్ హాసన్ సరసన తమిళంలో విడుదల కానున్న ఇండియన్ 3 లో కూడా నటిస్తుంది. కెరీర్‌లో బిజీగా ఉన్నప్పటికీ, రకుల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్‌లతో పాటు, రకుల్ తన వ్యక్తిగత అభిప్రాయాలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఇందులోభాగంగా రకుల్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పోస్ట్ చేసింది. అందులో, "మీ అలవాటైన దినచర్యలు మరియు ప్రదేశాల నుండి బయటపడండి, మీ కంఫర్ట్ జోన్ ఎల్లప్పుడూ మీకు శత్రువుగా ఉంటుంది" అని చెప్పే కోట్‌ను పోస్ట్ చేశాడు.