ఆ తెలుగు అమ్మాయి రంభ 90లలో టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపింది. ఆమె తన అందంతో పాటు నటనా నైపుణ్యంతో అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ఆమె అందరు అగ్ర హీరోలతో కలిసి నటించింది. తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా స్టార్ హీరోయిన్గా వెలిగిపోయింది. ఆమె బాలీవుడ్లో కూడా మెరిసింది. దీని తరువాత ఆమె వివాహం చేసుకుని జీవితంలో స్థిరపడింది. రంభ సినిమా పరిశ్రమను వదిలి వెళ్ళిపోయినా, ప్రేక్షకులు ఆమెను ఇంకా మర్చిపోలేదు. రంభ ఇప్పటికీ చాలా మంది ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాంటి రంభ ఇప్పుడు తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా రంభ మాట్లాడుతూ, సినిమా తన తొలి ప్రేమ అని అన్నారు. సినిమాల్లోకి తిరిగి ప్రవేశించడానికి ఇదే సరైన సమయం అని తాను భావిస్తున్నానని అన్నారు. నటిగా సవాలుతో కూడిన పాత్రలను చేపట్టడానికి ఇదే సరైన సమయం అని ఆమె అన్నారు. యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రలను పోషించడం ద్వారా ప్రేక్షకులతో అర్థవంతమైన రీతిలో కనెక్ట్ అవ్వాలని ఆమె కోరుకుంటున్నట్లు చెప్పింది.