బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తన ప్రియుడు నిక్ జోనాస్‌ను వివాహం చేసుకుని, అమెరికాకు వెళ్లి, అక్కడే స్థిరపడి హాలీవుడ్‌లో అనేక సినిమాలు చేయడం ద్వారా ప్రసిద్ధి చెందింది. తన సినిమాలతో పాటు సిరీస్‌లతోనూ తనదైన ముద్ర వేసిన ప్రియాంక ఇటీవల హెడ్స్ ఆఫ్ స్టేట్ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో, ప్రియాంక ఏజెంట్ నోయల్ పాత్రలో కనిపించి అందరినీ అలరించింది.
ఇటీవల ప్రియాంక చోప్రా ఒక ఇంటర్వ్యూలో హెడ్స్ ఆఫ్ స్టేట్ సినిమా గురించి, తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. దర్శకుడు ఇలియా నైషుల్లర్ హెడ్స్ ఆఫ్ స్టేట్ గురించి తనకు మొదట చెప్పినప్పుడు, తాను ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావాలని కోరుకున్నానని, ఈ యాక్షన్ చిత్రానికి ప్రధాన పాత్రలో హీరోయిన్ అవసరమని దర్శకుడు భావించడమే ఈ సినిమా చేయాలని అనుకున్నానని ప్రియాంక చోప్రా చెప్పింది.