కలకలం రేపుతోన్న హీరోయిన్ పూజ హెగ్డే వ్యాఖ్యలు

Admin 2020-11-07 20:07:13 entertainmen
పూజ హెగ్డే తాజాగా సౌతిండియా ప్రేక్షకులపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. హీరోయిన్ల నడుమంటే పిచ్చి అని ఆమె కామెంట్ చేసింది. హీరోయిన్లను వారు ఎల్లప్పుడూ మిడ్ డ్రెసుల్లోనే చూడాలనుకుంటారని తెలుపుతూ పకపకా నవ్వింది. మంచి పేరు ఇచ్చిన దక్షిణాది సినిమాపై ఇలా విమర్శలు చేయొద్దని నెటిజన్లు ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.