- Home
- bollywood
జనవరిలో ప్రసవించనున్న అనుష్క!....
టీమిండియా త్వరలోనే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఇటీవలే మూడు ఫార్మాట్లకు జట్లను ప్రకటించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీకి పితృత్వపు సెలవు మంజూరు చేశారు. కోహ్లీ భార్య అనుష్క శర్మ ప్రస్తుతం గర్భవతి. ఆమె 2021 జనవరిలో ప్రసవిస్తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో కోహ్లీ ఆసీస్ టూర్ లో తొలి టెస్టు తర్వాత భారత్ తిరిగి రానున్నాడు.ఆసీస్ టూర్ కు రోహిత్ శర్మను ఎంపిక చేయకపోవడంపై వచ్చిన విమర్శలతో బీసీసీఐ సెలెక్షన్ బృందం కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. వన్డే, టీ20 సిరీస్ లకు విశ్రాంతినిచ్చి, టెస్టు జట్టులో రోహిత్ కు స్థానం కల్పిస్తూ నేటి సమావేశంలో నిర్ణయించింది. వికెట్ కీపింగ్ బ్యాట్స్ మన్ సంజూ శాంసన్ పై సెలెక్టర్లు ఔదార్యం ప్రదర్శించారు. సీనియర్ కీపర్ సాహాకు గాయం నేపథ్యంలో సంజూను టీమిండియా వన్డే దళంలో అదనపు వికెట్ కీపర్ గా చేర్చారు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో గాయం నుంచి కోలుకుంటున్న ఇషాంత్ శర్మ మ్యాచ్ ఫిట్ నెస్ సాధిస్తే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం జట్టులో చేర్చుతామని సెలెక్టర్లు తెలిపారు.