కథానాయికగా తాజాగా ప్రగ్య జైస్వాల్ ఎంపిక

Admin 2020-11-10 19:34:13 entertainmen
బాలకృష్ణ, బోయపాటి కలయికలో రూపొందుతున్న మూడో చిత్రానికి కథానాయిక ఎంపిక ఓ పట్టాన తెమలడం లేదు. ఇటీవల మలయాళ భామ ప్రయాగ మార్టిన్ ని ఎంపిక చేసినట్టు వార్తలొచ్చాయి. అయితే, అంతలోనే ఆమె బాలయ్య పక్కన సరిపోవడం లేదంటూ, ఆమెను వద్దనుకున్నట్టు ప్రచారం జరిగింది. తాజాగా ప్రగ్య జైస్వాల్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. 'కంచె', 'మిర్చి లాంటి కుర్రోడు', 'గుంటూరోడు' వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకులను మెప్పించిన ప్రగ్య ఎంపిక దాదాపు పూర్తయినట్టు చెబుతున్నారు. ఇదిలావుంచితే, ఇందులో మరో కథానాయికగా మలయాళ సుందరి పూర్ణను ఇప్పటికే తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. 'సింహా', 'లెజండ్' వంటి హిట్స్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో దీనికి ఎంతో క్రేజ్ ఏర్పడింది.