- Home
- tollywood
233 రోజుల్లో పది లక్షల మంది ఫాలోవర్లు
సోషల్ మీడియా అకౌంట్ అనేది అందరికీ సాధారణం అయిపోయింది. సోషల్ మీడియాలో అకౌంట్ లేని వాళ్లు చాలా తక్కువనే చెప్పచ్చు. సినిమా వాళ్లకి అయితే చెప్పేక్కర్లేదు. వీటిని చక్కగా వినియోగించుకుంటున్న వాళ్లలో సినీ తారలు ముందుంటారు. తమ కొత్త చిత్రాల విశేషాలను, షూటింగు కబుర్లను, వ్యక్తిగత వివరాలను ఫొటోలతో సహా పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటూ వుంటారు. హీరో రామ్ చరణ్ ట్విట్టర్ లో తాజాగా ఓ రికార్డు కొట్టాడు. అతితక్కువ కాలంలో మిలియన్ (పది లక్షలు) ఫాలోవర్లను సాధించిన టాలీవుడ్ స్టార్ గా చరణ్ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది మార్చిలో ట్విట్టర్ లో అకౌంటును ప్రారంభించిన చరణ్, 233 రోజుల్లో పది లక్షల మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు.