ప్రస్తుతం 'వైల్డ్ డాగ్'లో నటిస్తున్న నాగార్జున

Admin 2020-11-13 20:06:13 entertainmen
'వైల్డ్ డాగ్' సినిమాలో నటిస్తూ.. మరోపక్క 'బిగ్ బాస్ 4' రియాలిటీ షోకి హోస్టుగా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున త్వరలో ఓ మల్టీ స్టారర్ చిత్రాన్ని చేయనున్నట్టు తెలుస్తోంది. మహేశ్ బాబుతో 'సరిలేరు నీకెవ్వరూ' హిట్ చిత్రాన్ని చేసిన అనిల్ రావిపూడి ఈ క్రేజీ ప్రాజక్టుకి దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. ఇటీవల నాగార్జునను కలసిన అనిల్ రావిపూడి దీనికి సంబంధించిన కథను వినిపించాడట. నాగార్జునకు ఈ కథ బాగా నచ్చిందని, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. అక్కినేని ఫ్యామిలీ హీరోలంతా కలసి 'మనం' చిత్రంలో నటించిన సంగతి మనకు తెలిసిందే. అది వినూత్నమైన కథాచిత్రంగా పేరుతెచ్చుకుని, ప్రేక్షకాదరణ కూడా పొందింది.