వివాదాస్పదం చేయవద్దన్న హర్ష్ కనుమిల్లి

Admin 2020-11-19 19:16:13 entertainmen
యువ నటుడు హర్ష్ కనుమిల్లిని హీరో బాలకృష్ణ చెంపదెబ్బ కొట్టారంటూ, ఓ వీడియో వైరల్ అవుతుండగా, అటువంటిదేమీ లేదని హర్ష్ స్పష్టం చేశాడు. హర్ష్ నటించిన 'సెహరి' చిత్రం పోస్టర్ ఇటీవల విడుదల కాగా, బాలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.బాలకృష్ణ కొట్టారంటూ ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండగా, యూ ట్యూబ్ వీడియో మేకర్లు, గతంలోని బాలయ్య వీడియోలను కలుపుతూ చాలా వీడియోలను తయారు చేసి వైరల్ చేస్తున్నారు.ఘటనపై స్పందిన హర్ష్ కనుమిల్లి, ఈ ఘటనను పెద్దదిగా చూడవద్దని కోరారు. తనను బాలకృష్ణ చెంప మీద ఏమీ కొట్టలేదని, అది కేవలం ఓ స్నేహపూర్వక ఘటనేనని, ప్రజలు, అభిమానులు తప్పుగా అర్థం చేసుకోవద్దని అన్నాడు.