- Home
- tollywood
హెల్మెట్ పెట్టుకోకుండా బైకు నడిపిన తాప్సీ
హెల్మెట్ పెట్టుకోకుండా స్టైలుగా రోడ్డుపై బైకు నడిపింది హీరోయిన్ తాప్సీ. ఈ విషయాన్ని గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు ఆమె నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను జరిమానా విధించారు. ఈ విషయాన్ని తాప్సీ స్వయంగా తెలిపింది. తాను హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడిపిన విషయానికి సంబంధించిన ఫొటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. హెల్మెట్ పెట్టుకోనందుకు నాకు పోలీసులు ఫైన్ వేయకముందు తీసిన ఫొటో ఇది’ అంటూ ఆమె పేర్కొంది. తాను ఒక సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ఆమె వివరించింది. తాప్సీ ప్రస్తుతం ‘రష్మీరాకెట్’' సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది.