పవన్ నాకు దైవంతో సమానం : బండ్ల గణేష్

Admin 2020-12-02 13:30:32 entertainmen
జనసేనాని పవన్ కల్యాణ్ కు వీరాభిమానిగా నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కు పేరుంది. తాజాగా మరోసారి పవన్ పై తన ప్రేమాభిమానాలను ఆయన చాటుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ నుంచి తప్పుకుని, బీజేపీకి మద్దతు పలికిన సంగతి తెలిసిందే. వ్యాఖ్యలపై బండ్ల గణేశ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... ఎన్నికల సమయం కాబట్టి రాజకీయాలు మాట్లాడకూడదని తానేం మాట్లాడటం లేదని అన్నాడు. తనకు ఏ రాజకీయ పార్టీలో సంబంధం లేదని చెప్పారు. పవన్ కల్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని... ఆయన నిజాయతీ, నిబద్ధత ఏమిటో తనకు తెలుసని అన్నారు.పవన్ మహోన్నతమైన వ్యక్తి అని గణేశ్ చెప్పారు. రాజకీయాలు ఎవరైనా చేసుకోవచ్చని, రాజకీయాలు ఎవరైనా మాట్లాడవచ్చని... కానీ, పవన్ గురించి కానీ, ఆయన వ్యక్తిత్వం గురించి కానీ ఎవరైనా మాట్లాడితే తాను సహించనని అన్నారు.