- Home
- tollywood
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కొండపొలం'
కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచీ గ్లామర్ పాత్రలే పోషిస్తూ.. తన అందచందాలతో ప్రేక్షకులను మైమరపిస్తున్న కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ తొలిసారిగా ఓ డీ గ్లామర్ పాత్రలో నటించింది. ప్రసిద్ధ నవల 'కొండపొలం' ఆధారంగా వైష్ణవ్ తేజ్ హీరోగా ప్రముఖ దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న చిత్రంలో రకుల్ ఇలా డీ గ్లామర్ పాత్రను పోషించింది. "ఈ సినిమాలో నటనకు ప్రాధాన్యత వున్న పాత్రను పోషించాను. డీ గ్లామర్ పాత్ర.. పైగా, రాయలసీమ యాసలో మాట్లాడుతుంటాను. ఇది నాకు కలకాలం గుర్తుండిపోయే పాత్రల్లో ఒకటి అవుతుంది. ఎప్పుడూ గ్లామర్ తో కూడిన పాత్రలే చేస్తుంటే మన మీద ఓ ముద్రపడిపోతుంది. 'ఈ అమ్మాయి గ్లామర్ పాత్రలు మినహా మరేమీ చేయలేదేమో'నని దర్శక నిర్మాతలు అనుకుంటారు. అందుకే, అప్పుడప్పుడు ఇలాంటి పాత్రలు చేయాలని అనుకుంటున్నాను' అని చెప్పింది రకుల్.