- Home
- tollywood
‘ఐ లవ్ దిస్ పిక్’ అంటూ నిహారిక పోస్ట్
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఇటీవల మెగాబ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక, గుంటూరు యువకుడు చైతన్యల వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇటీవల నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. వాటన్నింటిలో తనకు బాగా నచ్చిన ఫొటోను నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. నిహారికకు మంగళ స్నానం చేయిస్తోన్న సందర్భంగా ఈ ఫొటోను తీశారు. ‘ఐ లవ్ దిస్ పిక్’ అంటూ నిహారిక పేర్కొంది. ఈ ఫొటో నెటిజన్లను కూడా అలరిస్తోంది. కాగా, ప్రస్తుతం నిహారిక, చైతన్య మాల్దీవుల్లో హనీమూన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.