తార‌క్ తో పొలిటిక్ బ్రాక్ డ్రాప్ తో సినిమా?

Admin 2021-01-03 18:37:14 entertainmen
అరవింద సమేత..' వంటి సూప‌ర్ హిట్ సినిమా తర్వాత త్రివిక్ర‌మ్, జూనియ‌ర్ ఎన్టీఆర్ కాంబినేషన్ మ‌ళ్లీ రిపీట్ అవుతున్న విష‌యం తెలిసిందే. 'అరవింద సమేత..' తర్వాత త్రివిక్ర‌మ్ బ‌న్నీతో చేసిన 'అల.. వైకుంఠపురములో' సినిమా కూడా భారీ విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకోబోతున్న త్రివిక్ర‌మ్-ఎన్టీఆర్ సినిమాపై అభిమానులు ఆస‌క్తిగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో వారిద్ద‌రు క‌లిసి చ‌ర్చ‌లు జ‌రిపారు. నేప‌‌థ్యంలో వీరిద్ద‌రు క‌లిసిన ఈ ఫొటోను హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్.రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్ ‌రామ్ నిర్మిస్తున్నారు.