నాని నిర్మిస్తున్న కొత్తచిత్రం 'మీట్ క్యూట్'

Admin 2021-06-20 20:41:12 entertainmen
నేచురల్ స్టార్ గా పేరుతెచ్చుకున్న నాని ఎంత చక్కటి నటుడో, అంతటి అభిరుచి కలిగిన నిర్మాత కూడా. అందుకే, సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి తన అభిరుచి మేర సినిమాలు నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో నాని నిర్మిస్తున్న తాజా చిత్రమే 'మీట్ క్యూట్'. ఇందులో ఐదుగురు హీరోయిన్లు నటించనుండడం మరో విశేషం. ఆయా హీరోయిన్ల పేర్లను ఒక్కో సందర్భంలో వెల్లడిస్తామని నాని ఇటీవల చెప్పాడు. అయితే, తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి, ఇందులో ఓ కథానాయికగా కాజల్ అగర్వాల్ నటిస్తోందట. స్క్రిప్టుతో పాటు తన పాత్ర కూడా నచ్చడంతో కాజల్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. మిగతా హీరోయిన్లుగా నివేదా థామస్, ఆదాశర్మ తదితరులను పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. ఇందులో ప్రముఖ తమిళ నటుడు సత్యరాజ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇదిలావుంచితే, కాజల్ ప్రస్తుతం తెలుగులో చిరంజీవి 'ఆచార్య'లోను, నాగార్జున సరసన మరో సినిమాలోనూ నటిస్తోంది.